సూపర్‌ లుక్‌  | Mahesh Babu is sharing his stylish look on Instagram | Sakshi
Sakshi News home page

సూపర్‌ లుక్‌ 

Mar 10 2024 3:23 AM | Updated on Mar 10 2024 3:23 AM

Mahesh Babu is sharing his stylish look on Instagram - Sakshi

‘‘హాలీవుడ్‌ హీరోలా ఉన్నారు.. సూపర్‌ లుక్‌’’ అంటూ మహేశ్‌బాబు తాజా లుక్‌ గురించి నెటిజన్లు పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా మహేశ్‌బాబు తన స్టయిలిష్‌ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తున్నారు. ముందు నలుపు రంగు సూట్‌లో ఉన్న ఫొటోలు షేర్‌ చేసినప్పుడు సూపర్‌ అంటూ అభిమానులు మురిసిపోయారు. శనివారం గళ్ల చొక్కాతో ఒత్తయిన జుట్టుతో ‘త్రూ ది లెన్స్‌’ అంటూ మహేశ్‌ మరో ఫొటోను షేర్‌ చేయగా, ఆ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది.

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం కోసం మహేశ్‌ కొత్తగా మేకోవర్‌ అయ్యారు. మహేశ్‌తో పలు రకాల లుక్స్‌ని ట్రై చేస్తున్నారట రాజమౌళి. మరి.. మహేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది రాజమౌళి సినిమా లుక్కా? లేక ఏదైనా యాడ్‌ షూటా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో పలువురు విదేశీ తారలు కూడా నటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement