Mahesh Babu Expensive Caravan Cost Will Leave You In Shock - Sakshi
Sakshi News home page

లగ్జరీ కారవాన్‌‌‌ కొన్న మహేశ్‌బాబు!

Mar 19 2021 10:07 AM | Updated on Mar 19 2021 6:46 PM

Mahesh Babu Buys New Caravan, Cost Rs 8 Crores - Sakshi

స్టార్‌ హీరోలు సొంత కారవాన్‌ను ఉపయోగించడం పరిపాటిగా మారింది. టాలీవుడ్‌లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఇప్పటికే లగ్జరీ వానిటీ వ్యాన్‌ ఉంది. ఈ మధ్యే మహేశ్‌బాబు కూడా ఓ కారవాన్‌ను కొనుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్‌ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వ్యాన్‌ను హీరో దగ్గరుండి మరీ రెడీ చేయించుకున్నాడట. అందులో బాత్‌రూమ్‌, హాల్‌, కిచెన్‌, టీవీ సహా సకల సౌకర్యాలు ఉండేలా చూసుకున్నాడట. దీనికోసం మహేశ్‌ ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌ సెట్స్‌లో దీన్ని పార్క్‌ చేసేందుకు తాత్కాలిక షెడ్డును కూడా ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. 

కాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తన కారవాన్‌ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేస్తే, మహేశ్‌ ఏకంగా రెండు కోట్లు ఎక్కువ పెట్టి మరీ ఈ కార్వాన్‌ను సొంతం చేసుకున్నాడట. లేట్‌గా తీసుకున్నా లేటెస్ట్‌గా ఉన్న మహేశ్‌ కారవాన్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌ అవుతున్నాయి.

కాగా మహేశ్‌ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. మహానటి ఫేమ్‌ కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పరుశురామ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: సందీప్‌ వంగ డైరెక్షన్‌లో మహేష్!

Advertisement
 
Advertisement
Advertisement