సందీప్‌ వంగ డైరెక్షన్‌లో మహేష్!

Mahesh Babu To Act In Sandeep Reddy Vanga Direction - Sakshi

సందీప్‌ రెడ్డి వంగ డైరెక్షన్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో మిల్కీ బ్యూటీ తమన్నా..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను దుబాయ్‌లో పూర్తి చేసుకుని ఇటీవల చిత్ర యూనిట్‌ భారత్‌కు తిరిగి వచ్చింది. అక్కడ మహేష్‌ బాబుతో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరించినట్లు సమచారం. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ మూవీ రెండవ షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

ఈ గ్యాప్‌లో‌ మహేష్‌ ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ డైరెక్షన్‌లో నటించనున్నాడు. అయితే అది మూవీ కాదు. ఓ యాడ్‌ షూటింగ్‌ అట. హ్యావెల్స్ అనే ఎలక్రిక్‌ కంపెనీ ప్రకటనలో మహేష్‌ నటించనున్నాడు. ఈ ప్రకటనకు సంబంధించి షూటింగ్‌ ఈ రోజు జరగనుంది. అయితే ఈ యాడ్‌ను సందీప్‌ వంగ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇందులో మహేష్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది.  త్వ‌ర‌లోనే ఈ యాడ్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెలువడనున్నాయి.

చదవండి: 
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్‌ బాబు
మహేష్‌బాబుకు జైకొట్టిన నాగచైతన్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top