
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకుంభమేళా (Maha Kumbh 2025)కు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తల్లితో కలిసి వెళ్లాడు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ కాషాయ వర్ణం ధోతీలో కనిపించాడు. మెడలో రుద్రాక్ష మాలలున్నాయి.
ముఖానికి మాస్కుతో..
అక్కడికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌తోనే కనిపించాడు. బహుశా తన కొత్త సినిమా మేకోవర్ లుక్ కనిపించకూడదని ఇలా మాస్కుతో కవర్ చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సైతం తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్లింది. జనవరి 13న మొదలైన ఈ పవిత్ర ఉత్సవం.. ఈ నెల 26న శివరాత్రి నాడు ముగియనుంది.
సినిమా
విజయ్ దేవరకొండ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో అతిథి పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం ఇతడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది 12వ సినిమా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్లు భోగట్టా! ఈ మూవీ తర్వాత విజయ్.. రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా సినిమాల్లో నటించనున్నాడు.
చదవండి: పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్.. ఇప్పుడు గుడ్‌న్యూస్‌తో సీరియల్ నటి