Madhavi Latha Gives Clarity on Bigg Boss 7 Telugu Offer - Sakshi
Sakshi News home page

Madhavi Latha: బిగ్‌బాస్‌ 7 నుంచి పిలుపొచ్చిందన్న నచ్చావులే హీరోయిన్‌

Jul 9 2023 10:25 AM | Updated on Sep 2 2023 2:29 PM

Madhavi Latha Gives Clarity on Bigg Boss 7 Telugu - Sakshi

'నా అభిమానులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. బిగ్‌బాస్‌ 7 కోసం ఆ టీమ్‌ నన్ను సంప్రదించింది. ఇది తొలిసారి కాదు, ఇప్పటివరకు

సెలబ్రిటీలు ఏం తింటారు? ఎలా ఉంటారు? ఎమోషన్స్‌ను కంట్రోల్‌ చేసుకుంటారా? లేదా మనలాగే భావోద్వేగాలను బయటకు చూపిస్తారా? ఇలా చాలా ప్రశ్నలకు సింపుల్‌ సమాధానమే బిగ్‌బాస్‌. ఈ రియాలిటీ షోలో తారల రియల్‌ క్యారెక్టర్‌ బయటపడుతుంది. అప్పటివరకు వారిని స్క్రీన్‌పై ఎలా చూశామన్నదానికి భిన్నంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో కనబడుతూ ఉంటారు. ఇలాంటి షోకి రావాలని ఎంతోమంది తహతహలాడిపోతుంటే కొందరు మాత్రం వద్దురా బాబూ అని దండం పెట్టేస్తుంటారు.

మరో రెండు నెలల్లో బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ప్రారంభం కాబోతోంది. కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో పడింది బిగ్‌బాస్‌ మేనేజ్‌మెంట్‌. ఈ క్రమంలో నచ్చావులే హీరోయిన్‌ మాధవీ లతను సంప్రదించారట. తాజాగా ఈ విషయాన్ని సదరు హీరోయినే స్వయంగా ధృవీకరించింది. 'నా అభిమానులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. బిగ్‌బాస్‌ 7 కోసం ఆ టీమ్‌ నన్ను సంప్రదించింది.

ఇది తొలిసారి కాదు, ఇప్పటివరకు ఇలా మూడుసార్లు నాకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ ఇచ్చారు. కానీ నేనే సున్నితంగా తిరస్కరించాను. నాకు బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఏమాత్రం ఆసక్తి లేదు. నన్ను షోలో పాల్గొనాల్సిందిగా కోరిన బిగ్‌బాస్‌ టీమ్‌కు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది మాధవి. ఒకసారి ట్రై చేయొచ్చుగా అని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుండగా నో చెప్పి మంచి పని చేశారని మరికొందరు ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు.

చదవండి: 4 గంటలు ఏడుపు, 10 గంటలు నిద్ర.. అమ్మానాన్న విడాకులు నచ్చలేదు: హీరో కూతురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement