మహేశ్ రిలీజ్ చేసిన 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్ | Maa Nanna Super Hero Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

Maa Nanna Super hero Trailer: సూపర్ హీరో నాన్న ఎలా ఉన్నాడు?

Oct 5 2024 5:23 PM | Updated on Oct 5 2024 5:48 PM

Maa Nanna Super Hero Movie Trailer Launch

సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. పేరుకి తగ్గట్లే నాన్న అనే సెంటిమెంట్‌తో ఈ సినిమా తీశారు. హీరోకి ఇద్దరు నాన్నలు ఉండటం అనే కాన్సెప్ట్‌తో టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?

(ఇదీ చదవండి: మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?)

డబ్బు కోసం కొడుకుని మరొకరి అమ్మేస్తాడు ఓ తండ్రి. పెరిగి పెద్దయిన తర్వాత ఈ విషయం కొడుక్కి తెలుస్తుంది. ఆ తర్వాత కన్న తండ్రి, పెంచిన తండ్రితో ఎలాంటి జర్నీ సాగింది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కనెక్ట్ అయ్యేలా ఉంది.

సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయాజీ షిండే, సాయిచంద్ తండ్రి పాత్రల్లో కనిపించారు. అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే దసరా రేసులో వేట్టయిన్, విశ్వం, జనక అయితే గనక సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు సూపర్ హీరో నాన్న పోటీలో ఉన్నాడు. మరి హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి)

Advertisement
 
Advertisement
Advertisement