సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్‌ మూవీ Love Me Movie Starring Streaming On This OTT Platform. Sakshi
Sakshi News home page

లేటెస్ట్‌ తెలుగు హారర్‌.. సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

Published Fri, Jun 14 2024 10:55 AM | Last Updated on Fri, Jun 14 2024 12:47 PM

Love Me Movie Streaming On This OTT Platform

దెయ్యాన్ని చూసి భయపడే కథలు చాలానే ఉన్నాయి. కానీ దెయ్యాన్ని ఇష్టపడి, తనతో ప్రేమలో పడటం ఎప్పుడైనా చూశారా? అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా లవ్‌ మీ: ఇఫ్‌ యూ డేర్‌. టీజర్‌, ట్రైలర్‌తో బాగుందనిపించిన ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్‌ టాక్‌ అందుకున్న ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రత్యక్షమైంది. కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. హారర్‌ సినిమాలను ఇష్టపడేవారు వెంటనే సినిమాపై ఓ లుక్కేయండి..

కథేంటంటే..
అర్జున్‌ (ఆశిష్‌), ప్రతాప్‌ (రవికృష్ణ) యూట్యూబర్స్‌. మూడనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహలను పోగొట్టేలా వీడియోలు తీస్తూ ఉంటారు. ఓసారి ప్రతాప్‌.. తమ ఊరిలో జరిగిన మిస్టరీ ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ అపార్ట్‌మెంట్‌లో దెయ్యం ఉందని, అక్కడికి వెళ్లినవారిని అది చంపేస్తుందని తెలుసుకుంటాడు. అది విన్న అర్జున్‌.. ఒక్కడే ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!

 

చదవండి: హత్యపై దర్శన్‌ కుమారుడు కామెంట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement