లవ్‌ గురులా పరిష్కారాలు చెబుతాను  | Love Guru is set for Release on April 11 | Sakshi
Sakshi News home page

లవ్‌ గురులా పరిష్కారాలు చెబుతాను 

Mar 17 2024 3:45 AM | Updated on Mar 17 2024 3:45 AM

Love Guru is set for Release on April 11 - Sakshi

మృణాళిని, విజయ్‌ ఆంటోని 

విజయ్‌ ఆంటోని

‘‘మనందరిలో దాదాపు 95 శాతం మందికి ప్రేమ సమస్యలు ఉంటాయి. అమ్మాయిలను హ్యాండిల్‌ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. మా ‘లవ్‌గురు’ చూస్తే ప్రేమలో అమ్మాయిలను ఎలా హ్యాండిల్‌ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను ‘లవ్‌ గురు’లా పరిష్కారాలు చెబుతాను’’ అని విజయ్‌ ఆంటోని అన్నారు. విజయ్‌ ఆంటోని, మృణాళినీ రవి జంటగా నటించిన రొమాంటిక్‌ ఫిల్మ్‌ ‘లవ్‌ గురు’.

వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వంలో మీరా విజయ్‌ ఆంటోని సమర్పణలో విజయ్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం రంజాన్‌ సందర్భంగా ఏప్రిల్‌ 11న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మా లవ్‌ గురు’ సినిమా చూసిన తర్వాత పెళ్లి చేసుకున్నవారు, చేసుకోనివారు వారి జీవితాల్లోని మహిళలను మరింత అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు’’ అన్నారు. ‘‘లవ్‌ గురు’ చిత్రం విజయ్‌ ఆంటోనీగారి 2.ఓ అనుకోవచ్చు’’ అన్నారు వినాయక్‌. ‘‘ఈ సినిమాలో లీల పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మృణాళినీ రవి.

Advertisement
 
Advertisement
Advertisement