హారర్‌ కామెడీగా ‘లోపలికి రా చెప్తా’ | Lopaliki Raa Cheptha Release Date Out | Sakshi
Sakshi News home page

హారర్‌ కామెడీగా ‘లోపలికి రా చెప్తా’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Jun 15 2025 3:18 PM | Updated on Jun 15 2025 3:18 PM

Lopaliki Raa Cheptha Release Date Out

కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘లోపలికి రా చెప్తా’.  మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ కీలక పాత్రలు పోషించారు. హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్స్ అన్నింటినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని తెలుపుతూ.. చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలో హీరో క్యారెక్టర్  డెలివరీ బాయ్. అందుకే చిత్రంలోని మొదటి సాంగ్‌ను ఓ డెలివరీ బాయ్‌తో విడుదల చేయించాం. ఆ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. జూలై 5 న గ్రాండ్‌గా థియేటర్లలోకి సినిమాను తీసుకు రానున్నాం. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది. అవుట్ ఫుట్ చూసి టీమంతా ఎంతో  హ్యాపీగా ఉన్నాం. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే సినిమాగా ‘లోపలికి రా చెప్తా’ నిలుస్తుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలుసుకుందాం’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement