పూజా హెగ్డే కెరీర్‌పై మళ్లీ అనుకోని మబ్బులు కమ్ముకున్నాయి. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ, తన ఆశలన్నీ జననాయకన్ సినిమాపైనే పెట్టుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సూచిస్తున్నాయి.
అయితే పూజా హెగ్డేకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండవని దర్శకుడు హెచ్. వినోద్ స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టు పాత్రలో కనిపించే పూజా కోసం తొలుత అనేక సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, నిడివి కారణంగా చాలావాటిని షూట్ చేయలేకపోయారు. షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా కత్తిరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పూజాకు క్షమాపణలు కూడా చెప్పారు. 
ఇక రీమేక్ అంశంపై కూడా దర్శకుడు స్పందించారు. జననాయకన్ సినిమా, తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ అని అంగీకరించిన ఆయన, కథలో భారీ మార్పులు చేసి కొత్తగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ సినిమా జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది.


