'లియో' పార్ట్‌ 2 కథ రెడీ అంటూ షాకింగ్‌ కామెంట్‌​ చేసిన డైరెక్టర్‌ Lokesh Kanagaraj Comments On Leo Part 2. Sakshi
Sakshi News home page

'లియో' పార్ట్‌ 2 కథ రెడీ అంటూ షాకింగ్‌ కామెంట్‌​ చేసిన డైరెక్టర్‌

Jun 19 2024 7:09 AM | Updated on Jun 19 2024 9:13 AM

Lokesh Kanagaraj Comments On Leo Part 2

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన సినిమా 'లియో' గతేడాదిలో విడుదలైంది. సినిమాపై విమర్శలు వచ్చినా కూడా భారీగానే కలెక్షన్స్‌ రాబట్టింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించగా సంజయ్‌ దత్‌, ప్రియా ఆనంద్‌, అర్జున్‌ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. ఇప్పుడు లియో  సీక్వెల్‌ కథ రెడీ అంటూ లోకేష్‌ కనగరాజ్‌ తెలిపాడు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌లో ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌పై అధికారికంగా ప్రకటన ఏమైనా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో  రూపొందుతున్న'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌' చిత్రంలో విజయ్‌ నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రానున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కార్తీక్‌ సుబ్బరాజుతో తన 69వ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. రాజకీయాల కారణంగా ఇదే విజయ్‌కి చివరి సినిమా అవుతుందని కూడా నెట్టింట వైరల్‌ అయింది. 

దీనికి తెలుగు నిర్మాతలు తెరకెక్కించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ డీల్‌కు ఫుల్‌స్టాప్‌ పడిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో లోకేష్‌ కనగరాజ్‌ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్‌ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొనడం చర్చినీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో విజయ్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం రజనీకాంత్‌తో లోకేష్‌ కనకరాజ్‌   కూలీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది స్క్రీన్‌ ప్లే ఆలస్యం కావడంతో జూలై నెలలో సెట్‌ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement