Laila Movie X Review: ‘లైలా’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Vishwak Sen Laila Movie Twitter Review In Telugu, Check These Tweets Inside Before Watching The Film | Sakshi
Sakshi News home page

Laila Movie Twitter Review: ‘లైలా’మూవీ టాక్‌ ఎలా ఉందంటే..?

Feb 14 2025 7:14 AM | Updated on Feb 14 2025 8:29 AM

Laila Movie Twitter Review

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం ‘లైలా’(Laila Movie).  ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూన్నారు. ‘లైలా సినిమా కథేంటి? ఎలా ఉంది? విశ్వక్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.  ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ టాక్‌ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని.. విశ్వక్‌ సేన్‌ తప్ప సినిమా చెప్పుకోవడానికి ఏమి లేదని అంటున్నారు.

‘లైలా సినిమాలో విశ్వక్‌ సేన్‌ తప్ప చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలా ఉంది. స్క్రీన్‌ప్లే, మ్యూజిక్‌ కూడా యావరేజ్‌, విశ్వక్‌ సేన్‌ కష్టం వృథా అయిపోయింది. లేడీ గెటప్‌లో విశ్వక్‌ బాగున్నాడు’ అంటూ ఓ నెటిజన్‌ 2 రేటింగ్‌ ఇచ్చాడు. 

 

 ఫస్టాఫ్‌ డీసెంట్‌గా ఉంది. సోనూ మోడల్‌ పాత్ర అందరిని ఆకట్టుకుటుంది. కొన్ని కామెడీ సీన్స్‌ బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎక్కువ కామెడీ ఆశిస్తున్నా. ఇప్పటి వరకు విశ్వక్‌ సేన్‌ ఒక్కడే అందరిని డామినేట్‌ చేశాడు’ అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

 విశ్వక్‌ కెరీర్‌లో రాడ్‌ మూవీ లైలా. ఒక్క పాజిటివ్‌ సీన్‌ కూడా లేదు. క్రింజ్‌ కామెడీ సీన్స్‌, డబుల్‌ మీనింగ్‌, వల్గర్‌ డైలాగ్స్‌ తప్ప కథేమి లేదు. విశ్వక్‌ ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నాడో తెలియదు అంటూ మరో నెటిజన్‌ 0.25 రేటింగ్‌ ఇచ్చాడు.

 లైలా నిరుత్సాహపరిచింది.గుర్తించుకునేలా ఒక్క సన్నివేశం కూడా లేదు. క్రింజ్‌ కామెడీ, వల్గర్‌ సన్నివేశాలు మినహా చెప్పుకోవడానికి ఏమి లేదు. అల్ట్రా డిజాస్టర్‌ మూవీ అని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

 విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్‌లో అదరగొట్టేశాడు. క్లాస్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. లైలా కంప్లీట్‌గా విశ్వక్‌ వన్‌ మ్యాన్‌ షో. సినిమా బాగుంది అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement