Vijay Deverakonda and Samantha’s Kushi Movie Title Song Out - Sakshi
Sakshi News home page

Kushi Title Song: విజయ్-సమంత కెమిస్ట్రీ.. మళ్లీ అదే థియరీ!

Jul 28 2023 6:33 PM | Updated on Jul 28 2023 6:38 PM

Kushi Title Song Vijay Devarakonda Samantha - Sakshi

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఫుల్ లెంగ్త్ ప్రేమకథతో తీస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ అందుకోగా, ఇప్పుడు టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఇది కూడా అలానే మెలోడీయస్‌గా ఉంది. అయితే మళ్లీ ఓ విషయాన్ని సేమ్ ఫాలో అయిపోయారు.

(ఇదీ చదవండి: ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో స్టేజీపై చలాకీ చంటి!)

తొలిపాట 'నా రోజా నువ్వే'లో మణిరత్నం సినిమా పేర్లతో లిరిక్స్ రాశారు. దీన్ని కశ్మీర్ లో షూట్ చేశారు. 'ఆరాధ్య' పాటని భార్యభర్తల ఉండే అనుబంధం నేపథ్యంగా రాశారు. దీన్ని లీడ్ రోల్స్ ఉండే ఇంటిలో షూటింగ్ చేశారు. టైటిల్ సాంగ్ ని టర్కీలో చిత్రీకరించారు. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఈ పాటలో హిందీ లవ్‌స్టోరీ మూవీస్‌లో ఎక్కువగా వినిపించే ప్యార్, ఆషికి లాంటి పదాలు కనిపించాయి. 

ఇప్పటివరకు రిలీజైన అన్ని పాటల్ని దర్శకుడు శివ నిర్వాణ రాశారు. బహుశా రాబోయే మిగతా సాంగ్స్ కూడా ఆయనే రాసి ఉంటారనిపిస్తుంది. సెప్టెంబరు 1న థియేటర్లలోకి రాబోతున్న మూవీపై పాటల వల్ల మంచి బజ్ క్రియేట్ అవుతోంది. దీన్నిబట్టి చూస్తే ఓపెనింగ్స్ మంచిగానే వస్తాయని అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!)

Advertisement
 
Advertisement
Advertisement