ఆమెతో జోడీయే ఇష్టపడ్డారు.. నేను ప్రేమించిన నటిని తిట్టిపోశారు! | Kunwarr Amarjeet Singh Says His Ex Girlfriend Charlie Chauhan Faced Hatred, Deets Inside | Sakshi
Sakshi News home page

నా మాజీ ప్రియురాలిపై ద్వేషం చూపించారు: నటుడు

Jun 9 2024 11:33 AM | Updated on Jun 9 2024 12:01 PM

Kunwarr Amarjeet Singh Says His Ex Girlfriend Charlie Chauhan Faced Hatred

స్క్రీన్‌ మీద కనిపించే కొన్ని జంటలను ప్రేక్షకులు ఇష్టపడతారు. రియల్‌ లైఫ్‌లో కూడా వారిని జోడీలాగే చూడాలనుకుంటారు. అలా కాకుండా వేరొకరిని ప్రేమిస్తే అస్సలు సహించలేరు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి కున్వర్‌ అమర్‌జీత్‌- చార్లీ చౌహన్‌ జంటకు ఎదురైంది. దిల్‌ దోస్తీ డ్యాన్స్‌ అనే సీరియల్‌లో కున్వర్‌ రేయాన్ష్‌ సింఘానియా పాత్రలో నటించాడు. ఈ రోల్‌తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఆన్‌స్క్రీన్‌లో ఆమెతో.. ఆఫ్‌ స్క్రీన్‌లో మరొకరితో..
ఇందులో అతడు నటి శక్తి మోహన్‌తో జోడీ కట్టాడు. వీళ్లు రియల్‌ లైఫ్‌లో కూడా జంటగా కలిసుంటే చూడాలని ముచ్చటపడ్డారు ఫ్యాన్స్‌. కానీ కున్వర్‌.. మరో నటి చార్లీ చౌహన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇది అభిమానులకు మింగుడుపడలేదట. మీ జోడీ బాగోలేదని ముఖం మీదే చెప్పారట! దీని గురించి కున్వర్‌ మాట్లాడుతూ.. దిల్‌ దోస్తీ డ్యాన్స్‌ సీరియల్‌లోని నా పాత్రను ప్రేక్షకులు ప్రేమించారు. 

తనను ద్వేషించారు
అందులో నాతో జోడీ కట్టిన అమ్మాయినే ప్రేమించాలని భావించారు. కానీ అప్పుడు నేను చార్లీతో లవ్‌లో పడ్డాను. దీంతో జనాలు ఆమెను ఎక్కువ ద్వేషించారు. తిట్టుకున్నారు. మేము దాదాపు నాలుగేళ్లు కలిసున్నాం. తర్వాత పరిస్థితులు కూడా మారిపోవడంతో విడిపోయాము అని చెప్పుకొచ్చాడు. కాగా వీళ్లిద్దరూ కలిసున్నప్పుడు నాచ్‌ బలియే ఐదో సీజన్‌లో జంటగా పాల్గొన్నారు.

చదవండి: 550 సార్లు రీ-రిలీజ్‌ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement