Kumbari Movie Audio Launch Programme In Chennai Prasad Labs, Deets Inside - Sakshi
Sakshi News home page

Kumbari Movie: ఫ్రెండ్‌షిప్ నేఫథ్యంలో వస్తున్న కుంబారి.. ఆడియో రిలీజ్!

Aug 19 2023 5:09 PM | Updated on Aug 19 2023 5:48 PM

Kumbari Audio launch Programme In Chennai Prasad labs - Sakshi

రాయల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై టి.కుమారదాస్‌ నిర్మిస్తున్న చిత్రం 'కుంబారి'.  ఈ చిత్రంలో విజయ్‌ విశ్వ, నటి నలీఫ్‌ జియా, మహిళా సంజీవి నాయకిగానూ, జాన్‌ విజయ్‌ పరుత్తివీరన్‌ సరవణన్, శ్యామ్స్, మధుమిత, సెంథి, కాదల్‌ సుకుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కవి జోసెఫ్‌ కథ దర్శకత్వ వహిస్తున్నారు.  ఈ చిత్రానికి జై ప్రకాష్‌ జై సన్, పృథ్వీ కలిసి సంగీతమందించారు. తాజాగా ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్, ఆర్‌వీ ఉదయ్‌ కుమార్, ఎస్సార్‌ ప్రభాకరన్, శరవణ శక్తి, జీవ, అప్పుకుట్టి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్‌లో ఉందా? )

ఈ సందర్భంగా నిర్మాత కుమార్‌ దాస్‌ మాట్లాడుతూ.. స్నేహం కథాంశంగా రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రేమ, వినోదం, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో పాటు మంచి జనరంజకమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా చిన్న చిత్రాలని పక్కన పెట్టేస్తున్నారని, ఇలాంటి చిన్న చిత్రాల ద్వారానే ప్రముఖ స్టార్స్‌ తయారవుతున్నారని ఆయన అన్నారు. అప్పట్లో చిన్న చిత్రంలో నటించిన శివాజీరావు అనే వ్యక్తి ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నారని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్‌ విశ్వ మాట్లాడుతూ.. కుంబారి చిత్ర షూటింగ్‌ చాలా వేగంగా పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాత చిత్ర బడ్జెట్‌ గురించి ఆలోచించ వద్దని మొదట్లోనే చెప్పారన్నారు. చిత్రం బాగా వచ్చిందని ఆయన వెల్లడించారు. 

(ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!)

Advertisement
 
Advertisement
Advertisement