Krithi Shetty Plastic Surgery: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు

is krithi Shetty Ready to Get Plastic Surgery For Lips - Sakshi

‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. దీంతో కృతీకి సక్సెస్‌ ఫుల్‌ హీరోయినే అనే గుర్తింపు ఇచ్చేశారు. అదే క్రేజ్‌తో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. ఇటీవల ‘ది వారియర్‌’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఆమె తొలి ఫ్లాప్‌ చూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ద్విభాష చిత్రం డిజాస్టార్‌గా నిలిచింది. ఉప్పెన హిట్‌తో కృతిని ఓ రేంజ్‌లో ఎత్తేసిన ప్రేక్షకులు ఆమె అందం, అభియనంకు ఫిదా అవుతూ ప్రశంసలు జల్లు కురిపించారు.

చదవండి: సెట్‌లో దురుసు ప్రవర్తన.. నటుడు చందన్‌పై నిషేధం

అయితే ఇప్పుడు ‘ది వారియర్‌’ ఫ్లాప్‌తో ఆమెను విమర్శిస్తున్నారు. ఇందులో తన లుక్‌ అంతగా లేదని పలువురు కృతికి సూచించారట. దీంతో తన అందాన్ని మరింత మెరుగు పరుచుకునేందు పెంచుకునేందుకు ‘బేబమ్మ’ సర్జరీకి సిద్దమైందట. తన పెదాల పరిమాణాన్ని తక్కించుకునేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ఫేమస్‌ డాక్టర్‌ను  సంప్రదించి సలహా కూడా తీసుకుందని వినికిడి. ఇదే నిజమైతే సర్జరీతో అందానికి మెరుగులు అద్దుకున్న హీరోయిన్ల జాబితాలోకి ఇప్పుడు ఈ యంగ్‌ బ్యూటీ కూడా చెరినట్టే. 

చదవండి: ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top