వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా | Krishnamma Movie Streaming Now On This OTT | Sakshi
Sakshi News home page

వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా

May 17 2024 6:41 AM | Updated on May 17 2024 10:14 AM

Krishnamma Movie Streaming Now On This OTT

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల అయింది. అయితే, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది.

చిత్రపరిశ్రమలో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘కృష్ణమ్మ’ని విడుదల చేశాయి. ఇందులో సత్యదేవ్‌ నటనతో పాటు సెకండ్‌ పార్ట్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ కథా నేపథ్యం కాస్త సాగతీతగా ఉంటుంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’ వచ్చేసింది. మే 16 నుంచే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. థియేటర్‌లో చూడలేని ప్రేక్షకులు ఈ వీకెండ్‌లో ఇంట్లోనే చూసేయండి.

టాలీవుడ్‌లో మంచి ప్రతిభ ఉన్న నటుల్లో సత్యదేవ్‌ ఒకరు.  వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేసేందుకు ఎప్పుడూ ఆయన ముందుంటారు. ‘కృష్ణమ్మ’ సినిమా కూడా స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథగా సాగుతుంది. ఇందులో బలమైన భావోద్వేగాలతో పాటు రా రస్టిక్‌ కోణం ఉన్నప్పటికీ..  కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి తీరు కాస్త సాగతీత వ్యవహారంగా ఉంటుంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement