తంగలాన్ డైరెక్టర్‌ షూటింగ్‌లో ప్రమాదం.. డేరింగ్ స్టంట్‌ మ్యాన్‌ మృతి..! | Kollywood stuntman Raju Dies on the set of Pa Ranjith upcoming film | Sakshi
Sakshi News home page

Kollywood: షూటింగ్‌లో ప్రమాదం.. డేరింగ్ స్టంట్‌ మ్యాన్‌ మృతి.. హీరో విశాల్ సంతాపం

Jul 13 2025 7:33 PM | Updated on Jul 13 2025 7:40 PM

Kollywood stuntman Raju Dies on the set of Pa Ranjith upcoming film

కోలీవుడ్లో విషాదం నెలకొంది. పా రంజిత్దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూట్లో ప్రమాదం జరిగింది. ఘటనలో స్టంట్మ్యాన్రాజు మరణించారు.  కారుతో స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషాద ఘటనపై కోలీవుడ్ హీరో, నిర్మాత విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అతని మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' డైరెక్టర్ పా రంజిత్ సినిమా షూట్లో రోజు ఉదయం జరిగిన విషాదం గురించి విన్నా. కారు బోల్తా పడే సన్నివేశం చేస్తూ స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. అతను నా సినిమాల్లో చాలా రిస్క్ స్టంట్‌లు చేశాడు. ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు. అతనికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రాజు ఆత్మకు శాంతి చేకూరాలి. విషాద సమయంలో దేవుడు వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇది కేవలం ఈ ట్వీట్ మాత్రమే కాదు.. అతని కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాం. కోలీవుడ్ పరిశ్రమలో చాలా చిత్రాలకు ఆయన చేసిన కృషి ఎంతో విలువైంది. ఇది నా కర్తవ్యంగా వారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తా' అని పోస్ట్ చేశారు. రాజు మృతి పట్ల ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా తన సంతాపం ప్రకటించారు.

v

కాగా..స్టంట్ మ్యాన్రాజు తన సాహసోపేతమైన స్టంట్‌లతో కోలీవుడ్ పరిశ్రమలో ఫేమస్ అయ్యారు. తన కెరీర్లో చాలా ఏళ్లుగా కోలీవుడ్లో అనేక చిత్రాలకు పనిచేశారు. రాజుకు చాలా ధైర్యవంతుడిగా, నైపుణ్యం కలిగిన స్టంట్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం అతను పనిచేసిన చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. మూవీని 2021లో వచ్చిన 'సర్పట్ట పరంబరై'కి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. సినిమా 2026లో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement