పొంగల్ బరిలో మరో స్టార్ ‍హీరో.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! | Sakshi
Sakshi News home page

Captain Miller: పొంగల్ బరిలో 'కెప్టెన్ మిల్లర్'.. ఆ చిత్రాలతో పోటీ!

Published Sun, Dec 31 2023 7:35 AM

Kollywood Star Hero Movie Ready To Release On Sankranthi - Sakshi

కోలీవుడ్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం కెప్టెన్‌ మిల్లర్. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి అరుణ్‌ మాదేశ్వరన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్‌ సమర్పణలో సత్యజ్యోతి పిలిమ్స్‌ సంస్థ నిర్మించింది. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

పొంగల్‌ సందర్భంగా జనవరి 12వ తేదీన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం భారీ అంచనాల మధ్య తెరపైకి రానుంది. పీరియడ్‌ కథాంశంతో రూపొందిన ఇది స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగుతుందని యూనిట్‌ వర్గాలు ఇంతకు ముందే తెలిపారు. ఈ చిత్రంలో ధనుష్‌ పోరాట యోధుడిగా నటించారు. ఆయన గెటప్‌ చాలా భిన్నంగా ఉంటుంది. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల గురించి అందరూ చెప్పుకోవడం విశేషం. కాగా కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. ధనుష్‌ సాధారణంగా ఒక చిత్రానికి మూడు నెలల వరకు కాల్‌షీట్స్‌ కేటాయిస్తారు. అలాంటిది ఈ చిత్రానికి 9 నెలలకు పైగా కాల్‌షీట్స్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతమందిస్తుండగా.. సిద్ధార్థ్‌ నునీ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా చిత్రం పొంగల్‌ బరిలో భారీ చిత్రాలతో పోటీ పడబోతోంది. 

Advertisement
 
Advertisement