అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా? | Kollywood Star Good Bad Ugly Movie Telugu Teaser Out Now | Sakshi
Sakshi News home page

Good Bad Ugly Movie Telugu Teaser: అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ'.. తెలుగు టీజర్ రిలీజ్

Mar 1 2025 7:23 PM | Updated on Mar 1 2025 7:52 PM

Kollywood Star Good Bad Ugly Movie Telugu Teaser Out Now

కోలీవుడ్ స్టార్ అజిత్‌ కుమార్‌ హీరోగా నటిస్తోన్న యాక్షన్  థ్రిల్లర్‌ మూవీ 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్‌ ఆంటోని ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌ బ్యానర్‌లో నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇవాళ తెలుగుతో పాటు హిందీలోనూ గుడ్‌ బ్యాడ్ అగ్లీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్‌లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు.

అజిత్‌ కుమార్‌ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. ‍అయితే ఈ  మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్‌ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement