అజిత్ యాక్షన్‌ థ్రిల్లర్‌.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌ రిలీజ్ | Kollywood Star Ajith Kumar Good Bad Ugly Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

Good Bad Ugly Movie Teaser: అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. టీజర్‌ వచ్చేసింది

Feb 28 2025 7:16 PM | Updated on Feb 28 2025 7:58 PM

Kollywood Star Ajith Kumar Good Bad Ugly Movie Teaser Out Now

కోలీవుడ్ స్టార్ అజిత్‌ కుమార్‌ హీరోగా నటిస్తోన్న యాక్షన్  థ్రిల్లర్‌ మూవీ 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్‌ ఆంటోని ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌ బ్యానర్‌లో నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సి ఉన్నా అలా జరగలేదు. దీంతో వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అజిత్‌పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు.

అజిత్‌ కుమార్‌ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. ‍అయితే ఈ  మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్‌ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement