
కోలీవుడ్ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వేదికపైనే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న నిర్వాహకులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందారు.
తమిళనాడు విల్లుపురంలో ఉండే కూవాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై (తమిళమాసం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విశాల్ అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నాడు మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్‌ను నిర్వాహుకులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు.
దాంతో వెంటనే ఆయన టీమ్, మాజీ మంత్రి కే పొన్ముడితో పాటు కార్యక్రమం నిర్వాహకులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విశాల్‌కు ఇలా జరగడం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి. ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్ చెతులు వనుకుతూ.. చాలా నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పుడు ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని తర్వాత తన టీమ్ చెప్పింది. కానీ, ఇప్పుడు ఆయన ఎందుకు స్పృహ తప్పి పడిపోయారనేది తెలియదు.
கூட்டத்தில் மயங்கி விழுந்த விஷால்... விழுப்புரத்தில் பரபரப்பு#vishal | #thanthicinema | #villupuram pic.twitter.com/DgrXSOv9FU
— Thanthi TV (@ThanthiTV) May 11, 2025