ఒక‌రంటే ఒక‌రికి గౌర‌వం.. ఒక్క‌సారి కూడా గొడ‌వ‌ప‌డ‌లే! | Sakshi
Sakshi News home page

Aamir Khan Ex Wife: మా సంసారంలో అల్ల‌క‌ల్లోల‌మ‌య్యే గొడ‌వ‌లే లేవు.. మా అనుబంధ‌మే వేరు!

Published Sat, Feb 24 2024 3:10 PM

Kiran Rao on Ex Husband Aamir Khan: We Never Really Fought - Sakshi

విడాకులెందుకు తీసుకుంటారు? స‌ఖ్య‌త లేకో, భేదాభిప్రాయాలు రావ‌డం వ‌ల్లో, గొడ‌వ‌లు త‌లెత్త‌డం వ‌ల్లో, ప్రేమ త‌గ్గిపోవ‌డం వ‌ల్లో.. దూర‌మ‌వుతూ ఉంటారు. కానీ ఈ మాజీ సెల‌బ్రిటీ జంట మాత్రం మాక‌స‌లు గొడ‌వ‌లే లేవ‌ని, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ల‌మంటోంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్, నిర్మాత కిర‌ణ్ రావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్ప‌టికే ఆమిర్‌.. రీనా ద‌త్తాను ళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. ఇది అత‌డికి రెండో పెళ్లి.

విడాకులు తీసుకునేముందు గొడ‌వ‌?
ఆమిర్‌-కిర‌ణ్.. స‌రోగ‌సి ద్వారా 2011లో ఆజాద్ రావుకు త‌ల్లిదండ్రుల‌య్యారు. అయితే ఏమైందో ఏమోకానీ 2021లో వీరు విడిపోయారు. విడాకులు తీసుకునేముందు గొడ‌వ‌ప‌డ్డారా? అంటే అలాంటిదేం లేదంటోంది కిర‌ణ్‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా మాజీ భ‌ర్తతో నేను బాగానే ఉంటాను. త‌ల్లిదండ్రులుగా నా కొడుకును మేమిద్ద‌రం బాగా చూసుకుంటాం. చాలామంది పెళ్లి అంటేనే పెద్ద త‌ల‌నొప్పి అంటుంటారు. ఎన్నో స‌వాళ్లు ఎదుర్కోవాలంటారు. నేను కూడా అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను.

మా అనుబంధం అలాంటిది
కానీ ఆమిర్‌, నేను మాత్రం ఎప్పుడూ గొడ‌వ‌ప‌డ‌లేదు. విన‌డానికి వింత‌గా అనిపిస్తుందేమో కానీ. నిజంగానే మేము పోట్లాడుకోలేదు. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వ‌చ్చావి కానీ ఎన్న‌డూ గొడ‌వ‌ప‌డ‌లేదు. మేము ఒక‌రినొక‌రం ఎంతో గౌర‌వించుకుంటాం, ఒక‌రినొక‌రం ఎంతో అర్థం చేసుకుంటాం. ఒక‌రు చెప్పేది మరొక‌రు వింటుంటాం. బ‌హుశా దానివ‌ల్లే మా మ‌ధ్య‌ ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌లేదు. మా అనుబంధం అలాంటిది. అల్ల‌క‌ల్లోలానికి దారితీసే గొడ‌వ‌లు, చ‌ర్చ‌లు ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు అని చెప్పుకొచ్చింది. ఇది విన్న నెటిజ‌న్లు.. అలాంట‌ప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారో? మ‌రి అని సెటైర్లు వేస్తున్నారు.

చ‌ద‌వండి: బేబీ బంప్‌లో మౌనిక‌.. పిల్లా నువ్వంటే ప్రాణ‌మ‌న్న మ‌నోజ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement