గ్రామీణ కథతో డైరెక్షన్‌ | Kiran Abbavaram Upcoming Movies update | Sakshi
Sakshi News home page

గ్రామీణ కథతో డైరెక్షన్‌

Jun 13 2026 12:04 AM | Updated on Jun 13 2026 12:04 AM

Kiran Abbavaram Upcoming Movies update

సుధాకర్, సాయికుమార్, శరత్‌కుమార్, కిరణ్, దేవిక

హీరో కిరణ్‌ అబ్బవరం దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టారు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా చిత్రీకరణ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవిక భట్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.  ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తుండగా సురేష్‌ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రీ లుక్‌ తరహాలో శుక్రవారం ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ఏక్‌ దమ్‌ బిందాస్‌ పకానే వాలే’ అన్నది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ‘‘దర్శకుడిగా పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కథను సిద్థం చేశారు కిరణ్‌ అబ్బవరం. ఈ చిత్రానికి కిరణ్‌ కథారచయితగా, హీరోగా, స్క్రీన్‌ ప్లే రైటర్‌గా, దర్శకుడిగా చేస్తున్నారు. యూత్‌ను, కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement