కథ నచ్చితే మనస్ఫూర్తిగా సపోర్ట్‌ చేయండి: కిరణ్‌ అబ్బవరం | Kiran Abbavaram Interesting Comments About Love Reddy Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

కథ నచ్చితే మనస్ఫూర్తిగా సపోర్ట్‌ చేయండి: కిరణ్‌ అబ్బవరం

Oct 18 2024 9:26 AM | Updated on Oct 18 2024 10:53 AM

Kiran Abbavaram Talk About Love Reddy Movie

‘‘నేను, అంజన్‌ షార్ట్‌ ఫిలింస్‌ నుంచి వచ్చాం. మూడేళ్లుగా అంజన్‌ ఫ్యామిలీ అంతా ‘లవ్‌ రెడ్డి’ సినిమా కోసం కష్టపడుతున్నారు. కథ నచ్చితే ఈ సినిమాను మనస్ఫూర్తిగా స΄ోర్ట్‌  చేయండి. నా వంతుగా ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షోని నేను స్పాన్సర్‌ చేస్తాను’’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు. అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరన్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌ రెడ్డి’. సునంద బి. రెడ్డి, హేమలతా రెడ్డి, రవీందర్‌ .జి, మదన్‌ గోపాల్‌ రెడ్డి, నాగరాజ్‌ బీరప్ప, ప్రభంజన్‌ రెడ్డి, నవీన్‌ రెడ్డి నిర్మించారు. సుమ, సుష్మిత, హరీష్, బాబు, రవికిరణ్, జకారియా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ‘లవ్‌ రెడ్డి’ సినిమా నేడు రిలీజ్‌ అవుతోంది. 

(చదవండి: ‘లవ్‌ రెడ్డి’ మూవీ రివ్యూ)

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి అతిథిగా హాజరైన కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘అంజన్‌కు ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్లి΄ోయే ఉద్దేశం లేదు.. తను మంచి స్థాయికి చేరుకోవాలి’’ అన్నారు. ‘‘కథ పరంగా ‘లవ్‌ రెడ్డి’ పెద్ద సినిమానే’’ అని మదన్‌ గో΄ాల్‌ రెడ్డి, యశస్విని చె΄్పారు. ‘‘ఇటీవల హిందూపురంలో మా సినిమా ప్రివ్యూ వేస్తే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు స్మరణ్‌ రెడ్డి. ‘‘మీరు థియేటర్‌లోకి వెళ్లి కూర్చోండి చాలు... మా మూవీనే మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది’’ అని శ్రావణి తెలి΄ారు. ‘‘మా సినిమా నచ్చి  తెలుగులో మైత్రీ మూవీస్, కన్నడలో హోంబలే ఫిలింస్‌ రిలీజ్‌ చేస్తున్నాయి’’ అని అంజన్‌ రామచంద్ర చె΄్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రిన్స్‌ మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement