
బాలీవుడ్ జంట సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)- కియారా అద్వాణీ (Kiara Advani) పట్టలేనంత సంతోషంలో ఉంది. కారణం.. వీరికి ఈ ఏడాది జూలైలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. అప్పటినుంచి పసిపాపతోనే వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నారు. తొలిసారి మాతృత్వాన్ని అనుభవిస్తున్న కియారాకు అమ్మతనం కొత్తగానూ, తన్మయత్వంగానూ ఉంది.

ఈ డీల్ బాగుంది..
తన ఫీలింగ్స్‌ను సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది.. నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావు. ఈ డీల్ చాలా బాగుంది అని రాసుకొచ్చింది. దీనికి కళ్లలో నీళ్లు తిరుగుతున్న ఎమోజీ, చేతితో హార్ట్ సింబల్ చూపిస్తున్న ఎమోజీని జత చేసింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. 2021లో వచ్చిన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. 2023లో వీరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
సినిమా
రెండేళ్లకే పాప పుట్టడంతో ఆనందంలో తేలియాడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కియారా చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్‌గా నటించిన 'వార్ 2' ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. అలాగే యశ్ టాక్సిక్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. సిద్దార్థ్ విషయానికి వస్తే ఇతడు ప్రస్తుతం పరమ్ సుందరి మూవీ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కానుంది.