భావోద్వేగ దీపావళి | Keeda movie is releasing on November 11th | Sakshi
Sakshi News home page

భావోద్వేగ దీపావళి

Oct 27 2023 2:55 AM | Updated on Oct 27 2023 2:55 AM

Keeda movie is releasing on November 11th - Sakshi

పూ రాము

తాతా–మనవడి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కీడా’. పూ రాము, కాళీ వెంకట్‌ ముఖ్య తారలుగా దీపన్, పాండియమ్మ, విజయ, కమలి కీలక పాత్రల్లో నటించారు. ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన ఈ తమిళ చిత్రం తెలుగులో ‘దీపావళి’గా రిలీజ్‌ కానుంది. పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకుంది.  తెలుగు, తమిళ భాషల్లో నవంబరు 11న రిలీజ్‌  కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌ షేర్‌ చేశారు.

దీపావళి పండక్కి మనవడికి కొత్త డ్రెస్‌ కొనాలని ఓ మేకను అమ్మకానికి పెడతాడు తాత. కానీ అది మొక్కుబడి మేక కావడంతో ఊర్లో ఎవరూ కొనరు. చివరికి మటన్‌షాప్‌ పెట్టుకోవాలనుకునే వీరబాబు  కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. మేక పాత్ర అబ్బులుకు నటుడు సప్తగిరి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ‘‘ఈ చిత్రంలో తాత– మనవడు–మేక మధ్య అనుబంధం, వారి భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement