‘వాస్తు’ కోసం బాగా ప్రాక్టీస్‌ చేశా! : చైతన్యా రావు  | Sakshi
Sakshi News home page

‘వాస్తు’ కోసం బాగా ప్రాక్టీస్‌ చేశా! : చైతన్యా రావు 

Published Sun, Oct 29 2023 2:22 AM

Keeda Cola is an out and out entertainer: Chaitanya Rao Madadi - Sakshi

చైతన్యా రావు, బ్రహ్మానందం, రాగ్‌ మయూర్, తరుణ్‌ భాస్కర్, విష్ణు, జీవన్, రవీంద్ర విజయ్, రఘురామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కీడా కోలా’. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రానా సమర్పణలో కె. వివేక్‌ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్‌ కౌశిక్, శ్రీపాద్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రంలో ఓ కీల్‌ రోల్‌ చేసిన చైతన్యా రావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో టూరెట్‌ సిండ్రోమ్‌ (నత్తిగా మాట్లాడటం, మాట్లాడుతున్నప్పడు మధ్యలో ఆగడం)తో ఇబ్బందిపడే వాస్తు పాత్ర చేశాను. మనకు ఓ సమస్య ఉన్నప్పటికీ, అందరిలానే మాములు జీవితం గడపొచ్చనేది నా పాత్రలో ఉన్న  సందేశం. యూ ట్యూబ్‌ వీడియోలు, హాలీవుడ్‌ సినిమాలు చూసి వాస్తు పాత్రకు ప్రాక్టీస్‌ చేసుకుని ఆడిషన్‌కు వెళ్లాను’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement