కత్రినా కైఫ్‌ కిల్లింగ్‌ వర‍్కవుట్స్‌ వీడియో వైరల్‌ | Katrina Kaif:The Three Stages Of her Fitness instagram post viral | Sakshi
Sakshi News home page

Katrina Kaif: మైండ్‌కు ట్రైనింగిస్తా.. బాడీ ఫాలో కావాలి..లేదంటే!!

Sep 18 2021 4:29 PM | Updated on Sep 18 2021 7:59 PM

Katrina Kaif:The Three Stages Of her Fitness instagram post viral - Sakshi

బాలీవుడ్‌స్టార్‌ హీరోయిన్‌  కత్రినా కైఫ్ కొత్త వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. క్లిష్టమైన రీతిలో వర్కవుట్  చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

సాక్షి,ముంబై: బాలీవుడ్‌స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ కొత్త వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌గా మారి సెక్సీ ఫిగర్‌తో మరింత ఎట్రాక్టివ్‌గా  మారిన ఈ భామ శనివారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ కసరత్తు చేస్తున్న వీడియోను పోస్ట్‌‌ చేసింది. క్లిష్టమై వర్కవుట్  చేస్తున్న  ఈ వీడియో వైరల్‌గా మారింది. 

చదవండి :  Tiger-3: సల్మాన్‌ ఖాన్‌ డ్యాన్సింగ్‌ వీడియో వైరల్‌  

 "నేను నా మనసుకు శిక్షణ ఇస్తాను.. దాన్ని నా బాడీ ఫాలో అవుతుంది. లేదంటే రెజా కటానికి (ఫిట్‌నెస్ ట్రైనర్‌) కాల్ చేస్తా’’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో కిల్లింగ్‌ అంటూ సోఫీ చౌదరి కామెంట్‌ చేయగా అభిమానులు మాత్రం వావ్‌ అంటూ ఫిదా అవుతున్నారు. కాగా కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన టైగర్-3 మూవీలో నటిస్తోంది. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను ఇటీవల ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement