Tiger-3: సల్మాన్‌ ఖాన్‌ డ్యాన్సింగ్‌ వీడియో వైరల్‌  

Tiger 3 Salman Khan dances to ​his popular song viral video from sets in Turkey - Sakshi

సాక్షి, ముంబై: 'టైగ‌ర్ 3' సినిమా షూటింగ్ కోసం ట‌ర్కీ వెళ్లిన‌ బాలీవుడ్  కండలవీరుడు సల్మాన్ ఖాన్ పార్టీలో తెగ ఎంజాయ్‌ చేసినట్టు కనిపిస్తోంది. టర్కీలోని కప్పడోసియాలో మెయిన్‌ సాంగ్‌ షూట్ షెడ్యూల్‌ను ముగించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో సందడి సందడి చేశాడు. తన పాపులర్‌ మూవీలోని ఒక పాటకు స్టెప్పులతో ఇరగ దీశాడు. ఈ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు సన్‌రైజ్‌ను  ఆస్వాదిస్తున్న ఒక  అద్భుతమైన ఫోటోను స్వయంగా సల్మాన్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేయడం విశేషం.

టైగర్‌-3 షూటింగ్‌లో బిజీగా ఉన్న  సల్మాన్‌  పాట షూటింగ్‌ ముగియడంతో పార్టీలో సందడి చేశాడు.  ఆదివారం రాత్రి  జరిగిన ఈ పార్టీలో టర్కీ ఫ్యాన్స్‌కోసం 'టవల్ స్టెప్' తో సీటీలు కొట్టించాడు.  2004 లో విడుదలైన ముఝ్‌ సే షాదీ కరోగీ‘ మూవీలోని పాపులర్‌ పాట జీనే కే హై చార్ దిన్ పాటకు డ్యాన్స్‌తో ఇరగదీశాడు. దీంతో అభిమానులు సందడి చేస్తున్నారు. "కోయి డిస్టర్బ్ మత్ కరో, టైగర్ అభీ మిషన్ పార్ హై’’ (ఎవరూ అతడిని డిస్టర్బ్ చేయొద్దు..  టైగర్‌ మిషన్‌లో ఉన్నాడు) అని ఒకరు ,   కత్రినా కైఫ్ ఎక్కడ  భాయ్‌ అని మరొకరు కామెంట్‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా టర్కీ మంత్రితో దిగిన ఫొటోలు గత వారం  నెట్టింట హల్‌ చల్‌ చేశాయి. టైగ‌ర్ 3 టీమ్‌ తన కార్యాల‌యానికి  వచ్చిన   ఫోటోలను టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి మెహ్మెత్ నూరి ఎర్సోయ్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో  వస్తున్న టైగర్-3 మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top