ధనుష్‌కు జోడీగా కరీనా? | Kareena Kapoor Khan Could Join Dhanush in an Upcoming Hindi Film | Sakshi
Sakshi News home page

ధనుష్‌కు జోడీగా కరీనా?

Aug 24 2026 2:10 AM | Updated on Aug 24 2026 2:10 AM

Kareena Kapoor Khan Could Join Dhanush in an Upcoming Hindi Film

తమిళ నటుడు ధనుష్, బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ జోడీగా నటించే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ధనుష్‌ హీరోగా ‘ఇరుంబు తిరై, సర్దార్‌’ చిత్రాల ఫేమ్‌ పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఈ మైథలాజికల్‌ జంగిల్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కనుంది. బాలీవుడ్‌ దర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నవంబరులో పూర్తి స్థాయిలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులను ప్రారంభించి, వచ్చే ఏడాది జనవరిలో రెగ్యులర్‌ షూట్‌ను ప్రారంభించి, జూలై తర్వాత రిలీజ్‌ చేయాలన్నది యూనిట్‌ ప్లాన్‌ అట. కాగా, ఈ చిత్రంలోని ఓ లీడ్‌ రోల్‌లో కరీనా కపూర్‌ నటించే అవకాశం కనిపిస్తోంది.

ఈ సినిమా కోసం కరీనాతో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమేనని, కానీ ఇంకా ఫైనలైజ్‌ కాలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మిత్రన్‌ పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘దేవ్‌దాస్‌’లో ఐశ్వర్యా రాయ్‌ చేసిన లీడ్‌ రోల్‌కు తొలుత కరీనా కపూర్‌నే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కరీనా కపూర్‌ను వద్దనుకుని ఐశ్వర్యా రాయ్‌ను ఫైనలైజ్‌ చేశారు భన్సాలీ. 

అప్పట్నుంచి సంజయ్‌ లీలా భన్సాలీ–కరీనా కపూర్‌ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. కానీ సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మించిన అక్షయ్‌ కుమార్‌ ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రంలో కరీనా గెస్ట్‌ రోల్‌ చేశారు. మరి... ఇప్పుడు ధనుష్‌తో భన్సాలీ చేయబోయే సినిమాలో కరీనా కన్‌ఫార్మ్‌ అవుతారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement