తల్లిని ఏదైనా అంటే చెంప చెళ్లుమనిపిస్తానన్న కంగనా.. 'తను చేసిందీ అదేగా!' | Kangana Ranaut Old Post Showing Support For Will Smith Slapping Chris Rock Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Kangana Ranaut Controversy: 'నా తల్లిని అంటే చెంపలు వాయిస్తా..' కంగనా పాత పోస్ట్‌ వైరల్‌

Jun 9 2024 2:56 PM | Updated on Jun 9 2024 5:05 PM

Kangana Ranaut Old Post Showing Support for Will Smith Slapping Chris Rock Goes Viral

ఎవరైనా తెలివితక్కువ మనుషులు నా తల్లి లేదా సోదరి అనారోగ్యంపై ఇలా కుళ్లు జోకులు వేస్తే నేను కూడా విల్‌ స్మిత్‌లాగే చెంప చెళ్లుమనిపిస్తాను. మంచి పని చేశావ్‌

తొలిసారి ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను ఓ కానిస్టేబుల్‌ చెంప దెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయంలో కొందరు కానిస్టేబుల్‌ కుల్విందర్‌ సింగ్‌కు, మరికొందరు నటికి మద్దతు పలుకుతున్నారు. కాగా నాలుగేళ్ల క్రితం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ధర్నాపై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. 

రూ.100 తీసుకుని ధర్నా
వాళ్లంతా వంద రూపాయలు తీసుకుని ధర్నాలో పాల్గొన్నారని విమర్శించింది. అప్పట్లో ఆమె కామెంట్లు రైతులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే ఆ ధర్నా చేస్తున్నవాళ్లలో తన తల్లి కూడా ఉందని కుల్విందర్‌ పేర్కొంది. రైతులను కించపరిచినందుకే తనకు చెంప దెబ్బ రుచి చూపించానంది. ఈ ఘటనపై కంగనా సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దాడి చేయడాన్ని సమర్థిస్తున్నారంటే..
'నేరం చేసే ప్రతివాడికీ ఏదో ఒక కారణం ఉంటుంది. అలా అని నేరస్తుల భావోద్వేగాలకు విలువిస్తే.. అనుమతి లేకుండా ఓ వ్యక్తిపై దాడి చేయడం వంటి ఘటను సమర్థిస్తే అత్యాచారం, హత్యలు జరిగినా మీకేం పర్వాలేదనే అర్థం. మీలాంటివారు మీ మానసిక స్థితిపై దృష్టి సారించండి' అని ఘాటుగా ట్వీట్‌ చేసింది. ఈ క్రమంలో నెటిజన్లు ఆమె పాత పోస్టులను తవ్వి తీస్తున్నారు. 2022లో జరిగిన ఆస్కార్‌ వేడుకలో హాలీవుడ్‌ నటుడు క్రిస్‌ రాక్‌.. విల్‌ స్మిత్‌ భార్యను ఎగతాళి చేశాడు. దీంతో ఆస్కార్‌ వేదికపైనే క్రిస్‌ రాక్‌ చెంప చెళ్లుమనిపించాడు స్మిత్‌. ఈ చర్యను కంగనా సమర్థించింది. 

నేనైతే ఇలాగే చేస్తా
తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో.. 'ఎవరైనా తెలివితక్కువ మనుషులు నా తల్లి లేదా సోదరి అనారోగ్యంపై ఇలా కుళ్లు జోకులు వేస్తే నేను కూడా విల్‌ స్మిత్‌లాగే చెంప చెళ్లుమనిపిస్తాను. మంచి పని చేశావ్‌..' అని మెచ్చుకుంది. ఇప్పుడీ పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది. ఆ కానిస్టేబుల్‌ కూడా నువ్వు చెప్పినట్లే చేసింది, తల్లిని చులకన చేస్తూ లాగి పెట్టి కొడతానన్నావ్‌ కదా.. తనూ అదే చేసింది.., దీన్నే ఖర్మ అంటారు, నీకు ఇలా కావాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement