పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు | Kangana Ranaut Instagram Post Bollywood Stars Attending Anant Ambani Pre Wedding | Sakshi
Sakshi News home page

Anant Ambani Pre Wedding: అంబానీ ప్రీ వెడ్డింగ్‌‌లో మొత్తం బాలీవుడ్.. ఇదా అసలు మేటర్?

Mar 5 2024 4:23 PM | Updated on Mar 5 2024 4:39 PM

Kangana Ranaut Instagram Post Bollywood Stars Attending Anant Ambani Pre Wedding - Sakshi

గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా తెరిస్తే చాలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‪‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలే కనిపించాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు అందరికీ ఇంకేం పనిలేనట్లు జామ్ నగర్‌లోనే కనిపించారు. పాటలు పాడుతూ డ్యాన్సులేస్తూ ఊహించన పనులెన్నో చేశారు. అయితే ఇదేదో అంబానీ అంటే గౌరవంతో చేసింది కాదు. తెర వెనక కోట్ల రూపాయల డీలింగ్స్ జరిగాయట. తాజాగా హీరోయిన్ కంగన పోస్ట్‌తో ఇదంతా బయటపడింది.

(ఇదీ చదవండి: అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!)

స్టార్ సెలబ్రిటీల్లో చాలామంది ప్రతి విషయాన్ని డబ్బుతోనే లెక్కేస్తారు. సినిమాలు, యాడ్స్‌లో నటిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తారు. ఇది కాదన్నట్లు పలు వ్యాపారాలు చేస్తూ ఆస్తులు బాగానే కూడబెట్టుకుంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ అంబానీ లాంటి బిజినెస్‌మేన్ పెళ్లికి.. జస్ట్ అలా హాజరయ్యేందుకు కూడా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుంటారట. అవును మీరు సరిగానే విన్నారు. గతంలో తనకు కూడా ఇలా ఆఫర్స్ వచ్చాయని, కానీ తాను ఆత్మగౌరవం చంపుకోలేదని కంగన రాసుకొచ్చింది.

'ఆర్థికంగా దారుణమైన పరిస్థితుల‍్ని చాలాసార్లు నేను ఫేస్ చేశారు. కానీ ఎవరెన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చూసినా సరే పెళ్లిళ్లలో డ్యాన్స్ లాంటివి చేయలేదు. ఐటమ్ సాంగ్స్‌లో కూడా నాకు ఛాన్సులు వచ్చాయి. కానీ నేను చేయలేదు. కొన్నాళ్ల తర్వాత అవార్డ్ షోలకి కూడా వెళ్లడం మానేశాను. ఇలా డబ్బు, ఫేమ్ వద్దని చెప్పడానికి ఆత్మగౌరవం చాలా కావాల్సి ఉంటుంది' అని కంగన తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్)

కంగన తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఆర్టికల్ చూస్తే.. గతంలో దిగ్గజ సింగర్స్ ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ లాంటి వాళ్లకు కూడా తమ పెళ్లిలో పాటలు పాడితే రూ.50 కోట్లకు అంతకు మించిన మొత్తం ఇస్తామని ఆశ చూపారట. కానీ వాళ్లు వెళ్లలేదు. కానీ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‪‌లో మాత్రం బాలీవుడ్ హేమాహేమీలు అందరూ కనిపించారు. వీళ్లు.. పెళ్లికి హాజరవడంతో పాటు డ్యాన్సులు చేసినందుకు గానూ ఒక్కో సినిమాకు అయ్యేంత రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. బహుశా అందుకేనేమో ప్రీ వెడ్డింగ్‌కే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అయనట్లు ఉంది.

అంబానీ ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌లో బాలీవుడ్ స్టార్స్ షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్‌లతో పాటు చిన్న పెద్ద స్టార్స్ అందరూ వచ్చారు. దక్షిణాది నుంచి మాత్రం రామ్ చరణ్, రజినీకాంత్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు కంగన పోస్ట్ చూస్తుంటే.. చరణ్, రజినీకాంత్‌లకు కూడా పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చారేమో అనే సందేహం వస్తోంది.

(ఇదీ చదవండి: అనంత్‌-రాధిక : నీతా అంబానీ లాంగ్‌ నెక్లెస్‌ ధర ఎంతో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement