
ప్రస్తుతం కమల్ హాసన్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ఈవెంట్‌లో మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ కామెంట్ చేశాడు. దీనిపై కర్ణాటక అధికార, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాని తమ దగ్గర నిషేధిస్తున్నట్లు స్వయంగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ విషయమై కమల్ లేఖ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)
కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన కమల్.. 'కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉంది. మనదంతా ఒకే కుటుంబం అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషని తక్కువ చేయడం కాదు' అని కమల్ చెప్పారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహులుకు లేఖ రాశారు.
కర్ణాటకలో 'థగ్ లైఫ్' నిషేధించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకోవడంతో కమల్ హాసన్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా కమల్‌కి చివాట్లు పెట్టింది. మీరేమైనా చరిత్రకారులు అనుకుంటున్నారా? ఏ ఆధారంతో ఈ కామెంట్స్ చేశారు, సారీ చెబితే సరిపోతుంది కదా అని తీర్పు ఇచ్చింది. అయినా సరే కమల్ వెనక్కి తగ్గలేదు. క్షమాపణ చెప్పలేదు సరికదా.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్ చేయట్లేదని తన లేఖలో పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?)
