బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా? | Ilaiyaraaja Remuneration And Net Worth Details | Sakshi
Sakshi News home page

Ilayaraja: ఇళయారాజా ఆస్తి ఎంత? ఈ మధ్య ఎక్కువగా వివాదాల్లోనూ

Jun 3 2025 1:39 PM | Updated on Jun 3 2025 1:39 PM

Ilaiyaraaja Remuneration And Net Worth Details

మ్యాస్ట్రో ఇళయరాజా.. ఈ పేరు చెప్పగానే సంగీత ప్రియులు పరవశించిపోతారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో పెద్దగా ఈయన మార్క్ కనిపించట్లేదు గానీ 80-90ల్లో ఈయన ఓ సినిమా చేస్తున్నారంటే చాలు సూపర్ హిట్ గ్యారంటీ అనేలా ఉండేది. మరి ఇళయరాజా ఇప్పుడేం చేస్తున్నారు? ఒక్కో చిత్రానికి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు?

(ఇదీ చదవండి: కమల్ హాసన్‌కి చివాట్లు పెట్టిన హైకోర్ట్)

తమిళనాడులో 1943లో ఇదే రోజున(జూన్ 03) పుట్టిన ఇళయారాజా.. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కర్ణాటిక్, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న ఈయన.. 1976లో 'అనార్కలి' అనే తమిళ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో డిఫరెంట్‌గా క్రియేట్ చేసిన సౌండ్.. ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. ఇక అప్పటి నుంచి ఈయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

తెలుగు, తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో 1000కి పైగా సినిమాలకు ఇళయారాజా పనిచేశారు. 7000 పైచిలుకు పాటల కంపోజ్ చేశారు. నాయగన్, దళపతి చిత్రాలు ఈయన కెరీర్‌లోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పటికీ సినిమాలకు సంగీతమందిస్తున్న ఇళయరాజా.. ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఒకప్పటిలా తన సంగీతంతో ప్రభావం చూపించలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: రానా నాయుడు 2 ట్రైలర్‌ వచ్చేసింది)

ఇళయరాజా వ్యక్తిగత జీవితానికొస్తే.. జీవా అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. ఈమె 2011లో చనిపోయింది. వీళ్లకు ముగ్గురు పిల్లలు. కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరిణి. ఈ ముగ్గురు కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. యువన్ రాజా.. తండ్రిలానే సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇళయరాజా ఆస్తి విషయానికొస్తే.. గ్రాండ్ చెన్నై బంగ్లాతో పాటు పలు స్టూడియోలు, అత్యాధునిక సంగీత పరికరాలు ఈయన సొంతం. అలానే దాదాపు రూ.800 కోట్లకు పైగా ఆస్తి ఈయనకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇళయరాజా సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం.. 2010లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కొన్నాళ్ల ముందు వరకు ఈయన అంటే అందరికీ గౌరవం ఉండేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు దర్శక నిర్మాతలపై కాపీ రైట్ కేసులు పెడుతున్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇళయరాజా ఎందుకిలా చేస్తున్నారా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'జాట్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement