Kamal Haasan: హిందీ భాషపై కమల్‌హాసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Kamal Haasan Controversial Comments At Vikram Audio Launch Event - Sakshi

తమిళ భాష వర్ధిల్లాలి.. అని నటుడు కమల్‌ హాసన్‌ పిలుపునిచ్చారు. ఈయన కథానాయకుడిగా నటిస్తూ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం విక్రమ్‌. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో సూర్య అతిథి పాత్రలో కనిపించడం విశేషం. మాస్టర్‌ చిత్రం ఫేమ్‌ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది జూన్‌ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విక్రమ్‌ చిత్ర ట్రైలర్, ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్నిచెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. హిందీని వ్యతిరేకించనని, అలాగని తన మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాని పేర్కొన్నారు.

'చిన్నతనంలో శివాజీ గణేషన్‌ ఇంటికి ఎక్కువగా వెళుతుండే వాడిని. అలా తనకు తొలి గురువు ఆయన అయితే రెండవ గురువు గీత రచయిత వాలి. వారి వల్లే నేనిక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరూ అడ్డు వచ్చినా ఎదుర్కొంటా. ఇప్పుడు భాష గురించి చర్చ జరుగుతోంది..మాతృభాషను మరవకండి. హిందీకి వ్యతిరేకినని చెప్పను. అన్ని భాషలూ ఒకటే. అందరూ కలిస్తేనే ఇండియా' అంటూ చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top