‘కాంతారా’ తరహాలో ‘కలివీరుడు’ | Kaliveedu On The Lines Of Kantara | Sakshi
Sakshi News home page

‘కాంతారా’ తరహాలో ‘కలివీరుడు’

Jun 13 2023 5:45 PM | Updated on Jun 13 2023 5:45 PM

Kaliveedu On The Lines Of Kantara - Sakshi

కేజీయఫ్‌ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ ‘కాంతారా’తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. ‘కలివీర’ పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధిస్తూ... రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు ‘కలివీరుడు’గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని... "మినిమం గ్యారంటీ మూవీస్’పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘అవి’ దర్శకత్వంలో... రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. "కాంతారా" కోవలో "కలివీరుడు" తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అచ్చిబాబు నమ్మకం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement