'జాన్వీకపూర్‌ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్! | Jr NTR says Devara Actress Janhvi Kapoor reminds of Late Sridevi | Sakshi
Sakshi News home page

Jr NTR: 'జాన్వీకపూర్‌ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్!

Sep 17 2024 3:48 PM | Updated on Sep 17 2024 4:09 PM

Jr NTR says Devara Actress Janhvi Kapoor reminds of Late Sridevi

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎవరినీ పలకరించినా దేవర పేరే వినిపిస్తోంది. మరో పది రోజుల్లోనే థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ- ఎన్టీఆర్‌ డైరెక్షన్‌లో వస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ ‍చిత్రం దేవర. ఇందులో యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగాతో మూవీటీమ్ చిట్‌ చాట్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌పై ప్రశంసలు కురిపించారు. జాన్వీ నటన, హావభావాలు అచ్చం శ్రీదేవిలాగే ఉన్నాయని ఎన్టీఆర్ కొనియాడారు. తనకు తాను నటన  ప్రదర్శించుకున్న తీరు శ్రీదేవిని గుర్తు చేసిందని అన్నారు.

(ఇది చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?)

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..'నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము ఒక ఫోటోషూట్  కోసం  లుక్ టెస్ట్ చేశాం. అక్కడే జాన్వీ పడవలో కూర్చుని కెమెరా వైపు చూస్తోంది. ఆ ఫోటో చూడగానే అచ్చం శ్రీదేవిలా కనిపించింది. తను కేవలం కెమెరాలో కొంత భాగాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన విధానం, స్మైల్‌ మళ్లీ క్యాప్చర్ చేయగలరని నేను అనుకోను. అవీ చూడగానే శ్రీదేవి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చాయి' అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. జాన్వీ స్పందిస్తూ.. తెలుగులో నటించడం తనకు సొంత ఇంటిలా అనిపించిందని తెలిపింది. కాగా.. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement