దేవర బర్త్‌ డే ట్రీట్‌.. అప్‌డేట్‌ అదిరిపోయింది! | Jr Ntr Devara Movie Crazy Update On First Song, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Devara Movie Latest Update: దేవర బర్త్‌ డే ట్రీట్‌.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్‌!

Published Wed, May 15 2024 9:43 PM

Jr Ntr Devara Movie Crazy Update On

యంగ్ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ‍‍అయితే ఈ నెల 20న జూనియర్ బర్త్‌ డే కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. తాజాగా దేవర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పారు. మే 19న ఫియర్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

దేవర అప్‌డేట్‌తో పాటు చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. ఫియర్‌ సాంగ్‌ అంటూ పోస్టర్‌తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఎన్టీఆర్‌ పుట్టినరోజుకు కంటే ఒకరోజు ముందుగానే సాంగ్‌ రిలీజ్‌ కానుంది. దీంతో జూనియర్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్‌ సంగీతమందిస్తున్నారు. అనిరుధ్ కోలీవుడ్‌లో స్టార్‌ హీరోల సినిమాలకు పని చేస్తున్నారు.  రజనీకాంత్ జైలర్ మూవీకి సైతం ఆయన పనిచేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement