ముంబైలో దిగిన 'దేవర' | Jr NTR Arrives In Mumbai For Devara Promotions | Sakshi
Sakshi News home page

ముంబైలో దిగిన 'దేవర'

Sep 9 2024 6:55 AM | Updated on Sep 9 2024 8:50 AM

Jr NTR Arrives In Mumbai For Devara Promotions

జూ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర. సెప్టెంబర్‌ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, దేవర ట్రైలర్‌ సెప్టెంబర్‌ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో ముంబైలో అడుగుపెట్టాడు తారక్‌. 

ఆర్ఆర్ఆర్  హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో దేవరపై పాన్ ఇండియా రేంజ్‍లో భారీగా క్రేజ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే మేకర్స్‌ కూడా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు ప్రారంభించారు. బాలీవుడ్‌ నుంచే దేవర సినిమా ప్రమోషన్లను తారక్‌ ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన సెప్టెంబర్‌ 10న ట్రైలర్‌ కార్యక్రంలో పాల్గొననున్నారు. ఇదే ఈవెంట్‌లో  హిందీ మీడియాతో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే ఛాన్స్‌ ఉంది.

ధర్మతో దేవర
'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని  బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్  సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  కరణ్ జోహార్‌కి చెందిన ఈ నిర్మాణ సంస్థ మొదట 'బాహుబలి' సినిమాను బాలీవుడ్‌ పబ్లిక్‌లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని నార్త్ బెల్ట్‌లో విడుదల చేసేందుకు భారీ ధరకు రైట్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్‌లో దేవర వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్స్, ప్రమోషన్స్ అన్నీ ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఒక సినిమాను కరణ్ జోహార్ అండ్ టీమ్ ఎలా పబ్లిక్‌లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న దేవర ట్రైలర్‌ కోసం ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్‌ కూడా ఎదురుచూస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement