Jithender Reddy Trailer: జగిత్యాల టైగర్‌ అంటారు.. పేరు జితేందర్‌ రెడ్డి! | Jithender Reddy Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Jithender Reddy Trailer: జగిత్యాల టైగర్‌ అంటారు.. పేరు జితేందర్‌ రెడ్డి!

Nov 1 2024 1:12 PM | Updated on Nov 1 2024 1:24 PM

Jithender Reddy Movie Trailer Out

‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’. రాకేష్‌ వర్రే టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. 

అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్  ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు.  వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement