టాప్‌ దర్శకుడితో జయంరవి కొత్త సినిమా..? | Jayam Ravi And Karthik Subbaraj New Movie Details | Sakshi
Sakshi News home page

టాప్‌ దర్శకుడితో జయంరవి కొత్త సినిమా..?

Oct 19 2024 1:16 PM | Updated on Oct 19 2024 1:19 PM

Jayam Ravi And Karthik Subbaraj New Movie Details

కోలీవుడ్‌ నటుడు జయంరవి వరుసగా చిత్రాలు చేసుకుంటూపోతున్నారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నా, అవి ఆయన వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు. తను నటించిన తాజా చిత్రం బ్రదర్‌ దీపావళికి తెరపైకి రానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం సీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఈయన దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. 

కార్తీక్‌ సుబ్బరాజ్‌ ప్రస్తుతం నటుడు సూర్య కథానాయకుడిగా ఆయన 44వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2డీ.ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ, స్టోన్‌ బెంచ్‌ స్టూడియోస్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టెయినర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రానుందని సమాచారం. 

దీంతో కార్తీక్‌ సుబ్బరాజ్‌ జయంరవి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీన్ని ఆయన తన సొంత నిర్మాణ సంస్థ అయిన స్టోన్‌ బెంచ్‌ స్టూడియోస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement