అంబానీ ఇంట సెలబ్రేషన్స్‌.. జాన్వీ ధరించిన నెక్లెస్‌ అంత ఖరీదా? | Janhvi Kapoor Wears Choker at Anant Ambani, Radhika Merchant Pre Wedding, Do you Know Cast | Sakshi
Sakshi News home page

ధూంధాంగా అంబానీ పెళ్లి వేడుకలు.. జాన్వీ నెక్లెస్‌ ధర ఎంతో తెలుసా?

Jul 9 2024 12:24 PM | Updated on Jul 10 2024 5:10 PM

Janhvi Kapoor Wears Choker at Anant Ambani, Radhika Merchant Pre Wedding, Do you Know Cast

అంబానీ ఇంట పెళ్లి అంటే ఆరు నెలల నుంచే హడావుడి మొదలైంది. ఇప్పుడా సెలబ్రేషన్స్‌ పీక్స్‌కు చేరుకున్నాయి. అనంత్‌ అంబానీ -రాధిక మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో తారలు భాగమవుతూ సందడి చేస్తున్నారు. బాలీవుడ్‌ సుందరాంగి జాన్వీ కపూర్‌ తన ప్రియుడు శిఖర్‌ పహారియాతో కలిసి పెళ్లి వేడుకలను ఎంజాయ్‌  ఇటీవలే సంగీత్‌లో శిఖర్‌తో కలిసి స్టేజీపై చిందేసింది.

ఆరెంజ్‌ లెహంగా
ఇదిలా ఉంటే గుజరాతీ సాంప్రదాయం ప్రకారం ఇటీవల మామేరు అనే వేడుక నిర్వహించారు. ఇందుకోసం జాన్వీ ట్రెడిషనల్‌ లెహంగాను ఎంచుకుంది. ఆరెంజ్‌, రెడ్‌, పింక్‌, గోల్డ్‌ మిక్స్‌డ్‌గా ఉన్న లెహంగాను ధరించింది. దీనిపైకి చందేరి దుపట్టాను మ్యాచ్‌ చేసింది. ఈ డ్రెస్‌పైకి పెద్ద చోకర్‌ ధరించింది. ఆ చోకర్‌కు వచ్చిన కమ్మలనే చెవికి పెట్టుకుంది. పెద్ద స్టోన్స్‌ ఎంతో అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న ఈ నెక్లెస్‌ ధర ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.

నెక్లెస్‌.. అర కోటి
హజూరిలాల్‌ లీగసీ జ్యువెలర్స్‌కు చెందిన ఈ నగ ధర అక్షరాలా 52 లక్షల రూపాయలని తెలుస్తోంది. ప్రీవెడ్డింగ్‌కే ఇంత కాస్ట్‌లీ నగలు వేసుకుందంటే పెళ్లికి ఇంకే రేంజ్‌లో రెడీ అవుతుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంబానీ ఇంట జరిగే వేడుకలకు ఆమాత్రం రెడీ అవడం సాధారణమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: 'ఈ జనరేషన్‌లోనే వరస్ట్‌ హీరో'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement