Janhvi Kapoor Cuts Birthday Cake In Advance At Mumbai Airport - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జాన్వీ తీరుకు ఫ్యాన్స్‌ ఫిదా, హంబుల్‌, స్వీట్‌ అంటూ ప్రశంసలు

Mar 5 2022 5:10 PM | Updated on Mar 5 2022 5:38 PM

Janhvi Kapoor Cuts Birthday Cake At Mumbai Airport Gifted by Paparazzi - Sakshi

Janhvi Kapoor Cuts Birthday Cake At Mumbai Airport: బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన తీరుతో ఒక్కసారిగా అందరి ఆకట్టుకుంటోంది. ఆమె నిరాండబరత చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇంతకి జాన్వి ఇలా అందరి మన్ననలు పొందడానికి కారణం ముంబై ఎయిర్‌పోర్టు మీడియా పట్ల ఆమె చూపించిన వినయం. ఇంతకి ఏం జరిగిందంటే.. రేపు(ఫిబ్రవరి 6) జాన్వి బర్త్‌డే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది. దీంతో అక్కడ ఆమె చూసిన మీడియా జర్నలిస్టులు జాన్వికి అడ్వాన్స్‌గా బర్త్‌డే విషెస్‌ తెలిపారు. అంతేకాదు ఆమె కోసం బర్త్‌డే కేక్‌ కూడా తీసుకువచ్చారు.

చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్‌, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత

వారు అభిమానాన్ని తిరస్కరించకుండా జాన్వి కేక్‌ కట్‌ చేసింది. ఇలా అడ్వాన్స్‌గా మీడియాతో కలిసి ఆము పుట్టిన రోజును జరుపుకోవడం చూసి నెటిజనట్లు ఆమె వినయం, విధేయతకు మెచ్చుకోకుండ ఉండలేకపోతున్నారు. ‘హంబుల్‌, స్వీట్‌’ అంటూ జాన్వీని ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా దివంగత నటి శ్రీదేవి తనయగా పరిశ్రమలో అడుగు పెట్టింది. తన తొలి చిత్రం థడక్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జాన్వి తన నటన, ప్రతిభ, డ్యాన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె గుడ్‌ లఖ్‌ జెర్రీ మూవీలో నటిస్తోంది. ఇది తమిళ ఫిలిం కొలమావు కోకిల మూవీకి రీమేక్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement