నన్ను నమ్మినందుకు థ్యాంక్స్‌, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత | Samantha Wishes Director Nandini Reddy On Her Birthday With Emotional Post | Sakshi
Sakshi News home page

Samantha-Nandini Reddy: హ్యీపీ బర్త్‌డే మిత్రమా, నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు

Mar 5 2022 12:35 PM | Updated on Mar 5 2022 1:39 PM

Samantha Wishes Director Nandini Reddy On Her Birthday With Emotional Post - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత, డైరెక్టర్‌ నందిని రెడ్డికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పరిశ్రమలో వారిద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అందుకే వారిద్దరు ఎప్పుడు చాలా సరదాగా ఉంటారు. ఇదిలా ఉంటే ఈ రోజు(మార్చి 5) నందిని రెడ్డి బర్త్‌డే. ఈ సందర్భంగా సామ్‌ ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ఎమోషనల్‌ అయ్యింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియ మిత్రమా. నీ మంచితమే నీ గొప్పతనం. నువ్వు నాకు స్ఫూర్తి. నాకింకా గుర్తుంది. అది 2012వ సంవత్సరం. అప్పుడు నేను ఎంతో ఒత్తిడిలో ఉన్నా. నా ఆత్మవిశ్వాసం కోల్పోయి ఇక నటించనని అనుకున్న సమయంలో నువ్వు నా పక్కనే నిలిచావు..

ప్రతి రోజు నన్ను కలుస్తు నాలో ధైర్యం నింపేదానివి. నీ బిజీ షెడ్యూల్‌లో కూడా నా కోసం టైం కేటాయించావు. క్లిష్టపరిస్థితుల్లో నా వెన్నంటే ఉన్నావు. నువ్వు నన్ను చాలా నమ్మావు. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నీకు రాబోయే సంవత్సరాలలో మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా సమంత నటించిన జబర్దస్త్, ఓ బేబీ సినిమాలకు నందిని రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహించారు. అంతేగాక ఆహాలో సమంత హోస్ట్‌ చేసిన ‘సామ్ జామ్’ షోకి కూడా నందినినే డైరెక్టర్. సమంత నటించిన పలు యాడ్స్‌కు సైతం నందిని రెడ్డినే డైరెక్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement