Rajinikanth Jailer Movie Twitter Review In Telugu, Tweets You Must Read - Sakshi
Sakshi News home page

Jailer Movie Twitter Review: 'జైలర్' సినిమా ట్విటర్ రివ్యూ

Aug 10 2023 6:35 AM | Updated on Aug 10 2023 9:34 AM

Jailer Movie Twitter Review Rajinikanth - Sakshi

సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్నాళ్లుగా హిట్స్ లేక అల్లాడిపోతున్న తలైవా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేస్తారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ మూవీ కోసం తెగ వెయిట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ లుక్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఇలా ప్రతిదీ ఆకట్టుకునేసరికి అంచనాలు పెంచేసుకున్నారు. దీంతో 'జైలర్' ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోయారు. మరి ఆ అంచనాల్ని అందుకుందా?

(ఇదీ చదవండి: జైలర్ రిలీజ్.. ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న తలైవా!)

ఓవర్సీస్‌లో 'జైలర్' షోలు ఆల్రెడీ మొదలైపోయాయి. దీంతో సినిమా చూస్తున్న పలువురు ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఎలా ఉందనేది హింట్ ఇచ్చేస్తున్నారు. అయితే యూఎస్‌లో పలుచోట్ల ప్రీమియర్స్ ఆలస్యం కావడంతో ఫస్ట్ షోలు కాస్త ఆలస్యంగా పడ్డాయి. అయితేనేం రజినీ ఫ్యాన్స్ ఇప్పటికే ట్విట్టర్‌లో పోస్టులు, వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. 

ట్రైలర్ బట్టి చూస్తే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్, డార్క్ కామెడీ గట్టిగా ఉన్నాయట. పక్కా మాస్ స్టైల్ ఎంటర్ టైన్‌మెంట్ మూవీ అని చెబుతున‍్నారు. రూ.1000 కోట్ల బొమ్మ అని ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'సాక్షి' బాధ్యత వహించదు.

(ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?)

Advertisement
 
Advertisement
Advertisement