Sakshi News home page

ఓ ఆలోచన.. ఆరేళ్ల కష్టం.. ఫొటోలో వెలకట్టలేని అద్భుతం

Published Tue, Jan 23 2024 6:39 PM

Italian Photographer Perfect Photo of Moon Mountain and Basilica - Sakshi

ఫొటో అంటే అందమైన జ్ఞాపకం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఓ జీవితం. ఇప్పుడంటే మితిమీరిన ఫొటోల వల్ల దీనికి విలువ లేకుండా పోయింది గానీ ఒకప్పుడు ఫొటో అంటే అపురూపం. ఆల్బమ్స్‌లో జాగ్రత్తగా దాచుకునే వెలకట్టలేని అద్భుతం. ఫొటో తీయాలంటే కెమెరా ఉంటే చాలని చాలామంది అనుకుంటారు. కానీ దాని వెనక బోలెడంత తపన ఉండాలనేది ఇప్పటి జనరేషన్‌కి ఏ మాత్రం తెలియని మాట.

(ఇదీ చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!)

ఇ‍ప్పుడు పిల్లాడి దగ్గరి నుంచి పెద్దోళ్ల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్స్ వాడేస్తున్నారు. సెకనుకి పదుల ఫొటోలు తీసి పడేస్తున్నారు. కానీ ఓ ఫొటోగ్రాఫర్.. ఒక్క ఫొటో కోసం ఏకంగా ఆరేళ్లు ఎదురుచూశాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు. 2017లో ఓ ఆలోచన పురుడు పోసుకుంటే.. అతడు ఇన్నేళ్ల కష్టానికి తగ్గ ఫలితం 2023 డిసెంబరులో కనిపించింది. తన కెమెరా కంటితో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఒక్క ఫొటోలో వంద సినిమాలకు సరిపడా సంతృప్తి పొందుపరిచాడు. 

ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ వలెరియో మినాటో.. ఇటలీలోని టురిన్ అనే ఊరిలో మాన్విసో కొండ.. దాని ముందు చర్చి.. వెనక చంద్రుడు.. ఒక్కటిగా వచ్చే ఫొటో తీశాడు. ఈ ఛాయాచిత్రంలో ముందు చర్చి దాని వెనక ఓ పెద్ద  పర్వతం, ఆ వెనక పున్నమి చంద్రుడుని బంధించాడు. అయితే ఇలా ప్రతి డిసెంబరులో మాత్రమే వస్తుంది. 2017 నుంచి ఇలాంటి ఫొటో తీద్దామని ప్రయత్నిస్తుంటే.. వాతావరణం, వెలుతురు సమస్యల ఇతడికి సవాలు విసిరాయి. కానీ గతేడాది డిసెంబరు 20న మాత్రం తను అనుకున్నది సాధించాడు. ప్రపంచం మెచ్చే ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. 

(ఇదీ చదవండి: రాయల్‌ కరీబియన్‌ ‘పర్ల్‌’.. స్పెషల్‌ ఏంటంటే?)

Advertisement

What’s your opinion

Advertisement