రాయల్‌ కరీబియన్‌ ‘పర్ల్‌’.. స్పెషల్‌ ఏంటంటే? | Pearl Makes Waves As World Largest kinetic Sculpture | Sakshi
Sakshi News home page

రాయల్‌ కరీబియన్‌ ‘పర్ల్‌’.. స్పెషల్‌ ఏంటంటే?

Jan 19 2024 9:49 AM | Updated on Jan 19 2024 12:35 PM

Pearl Makes Waves As World Largest kinetic Sculpture - Sakshi

పైనున్న ఫొటోపై తీరికగా ఓ లుక్కేయండి!
ఏంటబ్బా ఇది అని ముక్కున వేలేసుకుంటున్నారా?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కైనెటిక్‌ కళా శిల్పమట.

అంటే ఏమిటి అనేనా మీ డౌట్‌!
అక్కడికే వస్తున్నాం. కైనెటిక్‌ అంటే కదిలేది అని అర్థం!
కళా శిల్పం అంటే ఏమిటో మీకు తెలుసు.
రెండింటినీ కలిపేయండి. ఇప్పటికీ అర్థం కాలేదా?
అయితే మీకు వివరంగా చెప్పాల్సిందే. చదివేయండి!.

‘రాయల్‌ కరీబియన్‌’ సంస్థ సిద్ధం చేసిన సరికొత్త క్రూయిజ్‌ షిప్‌లో ఓ భాగమీ నిర్మాణం. పేరు ‘పర్ల్‌’. పేరులో ఉన్నట్లే ముత్యం ఆకారంలోనే గుండ్రంగా కనిపిస్తోంది. దాదాపు 45 అడుగుల ఎత్తు, 53 అడుగుల వ్యాసమూ ఉంటుంది ఈ ‘పర్ల్‌’. మధ్యలో ఉన్న మెట్లను చూశారా? రెండు అంతస్తులను కలిపే ఈ మెట్లకు రెండు వైపులా పలకలు ఉన్నాయి చూశారా? అక్కడుంది అసలు విశేషమంతా! నిత్యం కదులుతూ అందమైన ఆకృతులను సృష్టిస్తూంటాయి ఈ పలకలు. అంతేనా అని పెదవి విరిచేయొద్దు. 

ఇంకా ఉంది.. పలకలన్నీ ఫెబినాకీ సిరీస్‌ (1, 1, 2, 3, 5, 8.. ప్రతీ అంకె ముందున్న రెండు అంకెల మొత్తం) ప్రకారం అమర్చడం ఒక విశేషం. రెండో విశేషం.. ఎక్కడో కరేబియన్‌ సముద్ర ప్రాంతంలో గాలి వేగం, అలల కదలికలకు తగ్గట్టుగా ఈ పలకలు కూడా కదులుతూంటాయి. దూరంగా పుట్టిన అల తాలూకూ ప్రశాంతత.. తీరాన్ని తాకే సమయంలో ఉండే ఉధృతి అన్నీ ఈ కదలికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నమాట. 

నాలుగేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశామని, ‘పర్ల్‌’లోని మొత్తం మూడు వేల పలకలను లీనియర్‌ ఆక్చుయేటర్‌తో అనుసంధానించి అన్ని దిక్కులకూ కదిలేలా చేశామని బ్రేక్‌ఫాస్ట్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరీబియన్‌ సముద్ర ప్రాంతపు వాతావరణ సమాచారం ఆధారంగా పలకల కదలికలను నియంత్రించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పలకల కదలికలకు తగ్గట్టుగా లైటింగ్‌ కూడా మారుతూంటుందని వివరించారు. ‘పర్ల్‌’ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని అనిపిస్తోందా? అయితే కింది వీడియో మీ కోసమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement