breaking news
special action
-
రాయల్ కరీబియన్ ‘పర్ల్’.. స్పెషల్ ఏంటంటే?
పైనున్న ఫొటోపై తీరికగా ఓ లుక్కేయండి! ఏంటబ్బా ఇది అని ముక్కున వేలేసుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కైనెటిక్ కళా శిల్పమట. అంటే ఏమిటి అనేనా మీ డౌట్! అక్కడికే వస్తున్నాం. కైనెటిక్ అంటే కదిలేది అని అర్థం! కళా శిల్పం అంటే ఏమిటో మీకు తెలుసు. రెండింటినీ కలిపేయండి. ఇప్పటికీ అర్థం కాలేదా? అయితే మీకు వివరంగా చెప్పాల్సిందే. చదివేయండి!. ‘రాయల్ కరీబియన్’ సంస్థ సిద్ధం చేసిన సరికొత్త క్రూయిజ్ షిప్లో ఓ భాగమీ నిర్మాణం. పేరు ‘పర్ల్’. పేరులో ఉన్నట్లే ముత్యం ఆకారంలోనే గుండ్రంగా కనిపిస్తోంది. దాదాపు 45 అడుగుల ఎత్తు, 53 అడుగుల వ్యాసమూ ఉంటుంది ఈ ‘పర్ల్’. మధ్యలో ఉన్న మెట్లను చూశారా? రెండు అంతస్తులను కలిపే ఈ మెట్లకు రెండు వైపులా పలకలు ఉన్నాయి చూశారా? అక్కడుంది అసలు విశేషమంతా! నిత్యం కదులుతూ అందమైన ఆకృతులను సృష్టిస్తూంటాయి ఈ పలకలు. అంతేనా అని పెదవి విరిచేయొద్దు. ఇంకా ఉంది.. పలకలన్నీ ఫెబినాకీ సిరీస్ (1, 1, 2, 3, 5, 8.. ప్రతీ అంకె ముందున్న రెండు అంకెల మొత్తం) ప్రకారం అమర్చడం ఒక విశేషం. రెండో విశేషం.. ఎక్కడో కరేబియన్ సముద్ర ప్రాంతంలో గాలి వేగం, అలల కదలికలకు తగ్గట్టుగా ఈ పలకలు కూడా కదులుతూంటాయి. దూరంగా పుట్టిన అల తాలూకూ ప్రశాంతత.. తీరాన్ని తాకే సమయంలో ఉండే ఉధృతి అన్నీ ఈ కదలికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నమాట. నాలుగేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశామని, ‘పర్ల్’లోని మొత్తం మూడు వేల పలకలను లీనియర్ ఆక్చుయేటర్తో అనుసంధానించి అన్ని దిక్కులకూ కదిలేలా చేశామని బ్రేక్‌ఫాస్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరీబియన్ సముద్ర ప్రాంతపు వాతావరణ సమాచారం ఆధారంగా పలకల కదలికలను నియంత్రించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పలకల కదలికలకు తగ్గట్టుగా లైటింగ్ కూడా మారుతూంటుందని వివరించారు. ‘పర్ల్’ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని అనిపిస్తోందా? అయితే కింది వీడియో మీ కోసమే! -
మలేరియా జ్వరాల నివారణకు చర్యలు
మలేరియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి సైదాపురం: జిల్లాలో ప్రబలిన మలేరియా జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా మలేరియా నివారణాధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సైదాపురం ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మండలంలోని పోతేగుంట గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సైదాపురం, డక్కిలి, రాపూరు, ఉదయగిరి ప్రాంతాల్లో మలేరియా బాధితుల సంఖ్య పెరిగిందన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది జ్వరాలు విపరీతంగా ప్రబలాయన్నారు. మలేరియా జ్వరాల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో మలేరియా నివారణకు సంబంధించి మందులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పు కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పారిశుద్ధ్యం చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వస్తున్న మలేరియా జ్వరాలతో పెద్ద ప్రమాదం లేదన్నారు. సరైన సమయంలో వైద్య పరీక్షలను చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి పాల్ జాన్స్‌న్, సబ్యూనిట్ అధికారి మురళి ఉన్నారు.