సోషల్‌ మీడియా సెన్సేషన్‌ కుశా కపిలా గురించి ఈ విషయాలు తెలుసా? | Interesting Facts About Actress Kusha Kapila | Sakshi
Sakshi News home page

Kusha Kapila: సోషల్‌ మీడియా సెన్సేషన్‌ కుశా కపిలా గురించి ఈ విషయాలు తెలుసా?

Nov 19 2023 1:44 PM | Updated on Nov 19 2023 2:21 PM

Interesting Facts About Actress Kusha Kapila - Sakshi

కుశా కపిలా... సోషల్‌ మీడియాతో స్టార్డమ్‌ తెచ్చుకున్న నటి. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్‌ చేస్తూ వచ్చిన ఫాలోయింగ్‌తో సినీ అవకాశాలను సొంతం చేసుకుంది. అలా సినిమాలతో పాటు వరుస వెబ్‌ సిరీసుల్లోనూ నటిస్తోన్న ఆమె గురించి కొన్ని విషయాలు..

కుశా కపిలా.. న్యూఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. చదువు పూర్తికాగానే.. ఫ్యాషన్‌ రంగంలోనే పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. కొంత కాలం కాపీ రైటర్‌గానూ పని చేసింది. ఆ తర్వాత ‘ఐదివా’ అనే ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌ వెబ్‌సైట్‌లో కంటెంట్‌ రైటర్‌గా చేరింది.

సోషల్‌ మీడియాలో ఢిల్లీ పంజాబీ గాసిప్‌ ఆంటీ ‘బిల్లీ మాసి’ అనే పాత్రను క్రియేట్‌ చేసి.. నటించింది. దాంతో కుశా పాపులర్‌ అవడమే కాక సోషల్‌ మీడియా సెన్సేషన్‌గానూ మారింది.

‘సన్‌ ఆఫ్‌ అబిష్‌’ అనే టీవీ షోతో బుల్లితెర ప్రవేశం చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’తో వెబ్‌ తెరపైనా మెరిసింది. అమెజాన్‌ ఒరిజినల్‌ కామెడీ షోలోనూ పార్టిసిపేట్‌ చేసింది.

‘ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి’లో కీలక పాత్ర పోషించి సినిమా ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్‌ కమింగ్‌’ సినిమాల్లోనూ నటించింది. ∙ ప్రస్తుతం ‘మైనస్‌ వన్‌: న్యూ చాప్టర్‌’, ’సోషల్‌ కరెన్సీ’ వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తోంది.

జీవితంలో ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కొంటేనే మనకేం కావాలో తెలుస్తుంది. – కుశా కపిలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement